గ్యాంగ్‌ రేప్‌ యత్నం: యువతి మృతి | Woman attacked as she resists rape bid by four, dies      | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌ రేప్‌ యత్నం: యువతి మృతి

Oct 30 2017 2:10 PM | Updated on Jul 28 2018 8:51 PM

Woman attacked as she resists rape bid by four, dies      - Sakshi

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది.

ముజఫర్‌ నగర్‌‌ : ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై నలుగురు దుండగులు గ్యాంగ్‌ రేప్‌నకు యత్నించారు. దీంతో మహిళ వారిని అడ్డుకునే యత్నం చేసింది. ఈ క్రమంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందింది. ఈ సంఘటన శామ్లి జిల్లాలోని భూర గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువతి(23) రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నలుగురు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమై అత్యాచారం చేయడానికి యత్నించారు.

దీంతో ఆమె వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కోపోద్రిక్తులైన దుండగులు ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement