మహిళని అపహరించి నెల రోజుల పాటు..

Woman Abducted And Molested By Six Men In Rajasthan - Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లో దారుణం జరిగింది. ఓ వివాహిత మహిళను అపహరించి నెల రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు దుండగులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగౌర్ జిల్లాకు చెందిన ఓ మహిళను ఆరుగురు దుండగులు కిడ్నాప్‌ చేశారు. ఆమెను వివిధ ప్రదేశాలకు తరలిస్తూ నెల రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నెల రోజుల తర్వాత వదిలేసి ఈ విషయం బయట చెప్తే చంపుతామని బెదిరించారు. ఇంటికి వచ్చిన మహిళ కుటుంభ సభ్యులతో కలిసి నాగౌర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురి దుండగుల్లో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top