టిక్‌టాక్‌ తెచ్చిన తంటా.. భార్యని కడతేర్చిన భర్త

Wife Murdered By Husband For Using Tick Tock - Sakshi

అన్నానగర్‌: ‘టిక్‌టాక్‌’ యాప్‌ వినియోగం విషయంలో భార్యని కత్తితో పొడిచి హత్య చేసిన భర్తని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన శుక్రవారం  కోవైలో చోటుచేసుకుంది.  కోవై సమీపం అరివొలినగర్‌కు చెంది న కనకరాజ్‌ (35) భవన నిర్మాణ కార్మికుడు. ఇతని భార్య నందిని (28).కోవై సమీపంలో ని ఓ ప్రైవేటు ఇంజినీరింగు కళాశాలలో పని చేస్తుంది. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుటుంబ తగాదాల కారణంగా కనకరాజ్, నందిని రెండేళ్లుగా విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు.  ఈ క్రమంలో నందిని కొన్నినెలలుగా టిక్‌టాక్‌ బానిసైంది. అధిక సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్‌  చేసినట్లు తెలుస్తుంది.

గురువారం కనకరాజ్‌ నందినికి ఫోన్‌ చేసి టిక్‌టాక్‌ యాప్‌లో వీడియోలను అప్‌లోడ్‌ చెయ్యవద్దని, తనతో కాపురం చేయాలని కోరాడు. ఈ విషయంపై అతను నందినికి కాల్‌ చేశాడు. ఈ సమయంలో ఫోన్‌ బిజీ రావడంతో  శుక్రవారం మధ్యాహ్నం కనకరాజ్‌ మద్యం సేవించి, నందిని పని చేస్తున్న కళాశాలకి వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. కోపంతో తన వెంట తెచ్చుకున్నకత్తిని తీసి నందినిని పొడిచాడు.  ఆమె సంఘటనా స్థలంలోనే  మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు  నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి కనకరాజ్‌ని అరెస్టు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top