ఉన్నవన్నీ పోగొట్టుకున్నాం..  ఎన్‌ఐటీ విద్యార్థులు

We Lost Everything Says AP Express Victims - Sakshi

వరంగల్‌ స్టేషన్‌లో ఆవేదన వెలిబుచ్చిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద బాధితులు

రైల్వేగేట్‌ : మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ వద్ద జరిగిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లో జరిగిన ప్రమాదంలో అన్నీ కోల్పోయామని ప్రమాద బాధితులు తెలిపారు.  మంగళవారం మధ్యాహ్నం ప్రమాద ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు వరంగల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రమాద బాధితులు మాట్లాడుతూ ‘మేం ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీ వచ్చి అక్కడి నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బీ–7 కోచ్‌లో హైదరాబాద్‌కు వస్తున్నాం.

మద్యప్రదేశ్‌ గ్వాలియర్‌ దగ్గర గల బిర్లానగర్‌ జంక్షన్‌ వద్ద షార్ట్‌ సర్క్యుట్‌ అయ్యింది. ప్రమాదాన్ని గమనించి మా వస్తువులన్నీ బోగీలోనే వదిలేశామంటూ ఉత్తరఖండ్‌ ఎన్‌ఐటీ విద్యార్థులు ఆవేదన వెలిబుచ్చారు.

ఈ నెల 21న ఉదయం 11.40 గంటలకు మద్యప్రదేశ్‌ గ్వాలియర్‌ వద్ద జరిగిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఉత్తరాఖండ్‌ ఎన్‌ఐటీలో సివిల్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చేస్తున్న మనీష్‌భట్‌(21), అంకిత్‌పాండె(21), స్వేతాసుమన్‌(20), హర్‌‡్ష(21)లు హైదారాబాద్‌లోని ఏసీఈ అకాడమీలో గేట్‌ కోచింగ్‌ కోసం వస్తుండగా మార్గమద్యలో జరిగిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో బీ–7 కోచ్‌లోని 59, 61, 62, 64 బెర్తులలో ఉన్న టాయిలెట్స్‌ నుంచి విపరీతంగా పొగలు వచ్చాయి.

కొంతసేపు తమకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదని, ఆ తర్వాత మంటలు వస్తుండడంతో వెంటనే తమ వస్తువులు 4 ల్యాప్‌టాప్‌లు, 6 బ్యాగులు, సర్టిఫికెట్లు, బట్టలు, మొబైల్‌ఫోన్స్, ఐడీ కార్డులు, వ్యాలెట్స్, ఆధార్‌కార్డులు, ఏటీఎం కార్డులు, టెన్త్, ఇంటర్‌ సర్టిఫికెట్లు మొత్తం మంటల్లో కాలిబూడిదయ్యాయని తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని గ్వాలియర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఫిర్యాదు చేసినట్లు విద్యార్థులు వివరించారు.

విద్యార్థులకు భోజనం ఏర్పాటు..

చేతిలో ఎలాంటి డబ్బులు, వస్తువులు లేకుండా వరంగల్‌ స్టేషన్‌లో దిగిన మనీష్‌భట్, అంకిత్‌పాండె, స్వేతా సుమన్, హర్ష్‌లకు అక్కడే కవరేజీకోసం వచ్చిన విలేకర్లు భోజనం ఏర్పాటుచేశారు. అలాగే రైల్వే అధికారులు ఆ విద్యార్థులను ఉచితంగా ఈస్ట్, కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు పంపించారు.

పొగను చూసి భయపడ్డాం:కిరణ్, ప్రియాంక

‘మేమిద్దరం ఏపీ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లోని ఏ–5 కోచ్‌లో ఉన్నాం. సరిగ్గా ఉదయం 11.46 గంటలకు మా పక్కనే ఉన్న బీ–7 కోచ్‌ నుంచి పొగలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఆ తర్వాత మంటలు రావడంతో ఏదో ప్రమాదం జరిగిందనుకున్నాం. వెంటనే అప్రమత్తమై రైలు దిగామంటూ తమకు జరిగిన అనుభవాన్ని చెప్పారు హైదరాబాద్‌కు చెందిన కిరణ్, ప్రియాంకలు.

మంగళవారం డిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వచ్చి వరంగల్‌లో దిగారు. తాము వ్యక్తి గత పనుల మీద ఢిల్లీకి వెల్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు. వరంగల్‌ జీఆర్‌పీ సీఐ జూపల్లి వెంకటరత్నం, ఆర్‌పీఎఫ్‌ సీఐ రవిబాబులు ఏపీ ఎక్స్‌ప్రెస్‌ వరంగల్‌ స్టేషన్‌కు వచ్చినపుడు ఇక్కడ దిగిన ప్రమాద బాధితులను అక్కడ జరగిన సంఘటనపై వివరాలు అడిగి వారి పేర్లు నోట్‌ చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top