కాంబ్లీ భార్యతో అసభ్య ప్రవర్తన | Vinod Kambli and Wife Brawl with An Old Man in Mall | Sakshi
Sakshi News home page

Jul 2 2018 10:11 AM | Updated on Oct 8 2018 5:45 PM

Vinod Kambli and Wife Brawl with An Old Man in Mall  - Sakshi

సాక్షి, ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ భార్యతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. కాంబ్లీ భార్య ఆండ్రియా ఆ వృద్ధుడిపై చెయ్యి చేసుకోగా.. సదరు వృద్ధుడ్ని బాలీవుడ్‌ సింగర్‌ అంకిత్‌ తివారీ తండ్రి రాజ్‌ కుమార్‌ తివారీగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో అంకిత్‌ సోదరుడు అంకుర్‌ తిరిగి కాంబ్లీ దంపతులతో వాగ్వాదానికి దిగారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం మలాద్‌లోని ఇన్‌ఆర్బిట్‌ మాల్‌కు కాంబ్లీ-ఆండ్రియా వెళ్లారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ వృద్ధుడు ఆండ్రియాను తాకాడు. దీంతో కోపంతో ఆమె తన చేతిలోని బ్యాగుతో అతనిపై దాడి చేసింది. ఆ వెంటనే కాంబ్లీ జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. 

అయితే కాసేటికే ఆ వ్యక్తి కొడుకులమంటూ ఓ ఇద్దరు వ్యక్తులు కాంబ్లీ-ఆండ్రియాలతో గొడవకు దిగారు. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవటంతో మాల్‌ సిబ్బంది జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటన తర్వాత కాంబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరోవైపు తివారీ సోదరులు కూడా బంగూర్‌ నగర్‌ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 

చెప్పుతో కొట్టింది... కాగా, తివారీ సోదరులు ఘటనపై మీడియాతో మాట్లాడుతూ కాంబ్లీ భార్యపై ఆరోపణలు గుప్పించారు. ‘తోపులాటలో నా తండ్రి పొరపాటున ఆమెను తాకాడు. వృద్ధుడని కూడా చూడకుండా ఆమె చెప్పుతో కొట్టింది. అందుకే వాళ్లను మేం నిలదీశాం. కానీ, కాంబ్లీయే మమల్ని బెదిరించాడు’ అని అంకుర్‌ చెబుతున్నాడు. అయితే కాంబ్లీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement