breaking news
Andrea Hewitt
-
Vinod Kambli: విడాకులకు సిద్ధమైన భార్య.. ‘తల్లి’ మనసు కరిగి..
కష్టసుఖాల్లో తోడుంటానన్న పెళ్లి నాటి ప్రమాణాలను ఆ భర్త మరిచాడు. తాగుడుకు బానిసై భార్యాబిడ్డలను పట్టించుకోవడమే మానేశాడు. తన చెడువ్యసనాల కారణంగా అనారోగ్యం పాలై ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.భర్త తీరుతో విసిగిపోయిన ఆ భార్య అతడిని వదిలేద్దామనుకుంది. విడాకులు(Divorce) తీసుకోవాలని నిశ్చయించుకుంది. కానీ.. కట్టుకున్న వాడి పరిస్థితి చూసి ఆమె మనసు కరిగిపోయింది. అతడు కూడా ‘బిడ్డ’లాంటి వాడేనంటూ ‘తల్లి’లా మళ్లీ చేరదీసింది. తమ ఇద్దరు పిల్లల్లాగే ఇప్పుడు అతడి ఆలనాపాలనా ఆమే చూసుకుంటోంది. నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది. ఆ భార్యాభర్తలు ఆండ్రియా హెవిట్(Andrea Hewitt)- వినోద్ కాంబ్లీ(Vinod Kambli).టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో కొన్నాళ్లపాటు సత్తా చాటినా.. ఆ తర్వాత అదే జోరును కనబరచలేకపోయాడు ముంబై ప్లేయర్ కాంబ్లీ. ఉన్నత శిఖరాలకు చేరుకోగల సత్తా ఉన్నా క్రమశిక్షణా రాహిత్యం వల్ల.. తన భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నాడనే విమర్శలూ ఉన్నాయి. మోడల్‌పై మనసు పారేసుకునిఇక వినోద్ కాంబ్లీ వ్యక్తిగత జీవితం కూడా అంతగొప్పగా ఏమీ లేదు. తొలుత నొయెల్లా లూయీస్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆమెతో ఎక్కువ కాలం బంధం కొనసాగించలేకపోయాడు. అనంతరం.. ఓ బిల్‌బోర్డుపై ఉన్న యాడ్‌లో కనిపించిన మోడల్‌పై మనసు పారేసుకున్నాడు కాంబ్లీ.ఆమే ఆండ్రియా హెవిట్. ఆమెను నేరుగా కలిసి మనసులోని మాటను చెప్పడంతో పాటు.. పెళ్లికి కూడా ఒప్పించాడు. ఇరువురి అంగీకారంతో 2006లో సివిల్ కోర్టులో చట్టబద్దంగా పెళ్లి జరిగింది. వినోద్- ఆండ్రియా దాంపత్యానికి గుర్తుగా కుమారుడు జీసస్ క్రిస్టియానో కాంబ్లీ, కుమార్తె జొహానా జన్మించారు.అయితే, పందొమిదేళ్ల వైవాహిక బంధంలో ఆండ్రియా- వినోద్ కాంబ్లీ మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. అయితే, వినోద్ మద్యపానం, ధూమపానానికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు.. ఒక దశలో ఇంటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశాడట.గృహహింస కేసుఅంతేకాదు.. భార్యను వేధించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2023లో ఆండ్రియా వినోద్ కాంబ్లీపై గృహహింస కేసు పెట్టింది. కుకింగ్ ప్యాన్‌తో తనను కొట్టడంతో తలకు గాయమైందని ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఆ తర్వాత ఇద్దరు కాంప్రమైజ్ అయినట్లు సమాచారం.కానీ వినోద్ కాంబ్లీ మాత్రం చెడుఅలవాట్లను వదల్లేదు. ఈ క్రమంలో ఓసారి గుండెపోటుకు గురికావడంతో పాటు.. దాదాపు 14సార్లు పునరావాస కేంద్రానికి వెళ్లినా వ్యసనాల్ని మాత్రం వదల్లేకపోయాడు. దీందో విసుగు చెందిన ఆండ్రియా అతడికి విడాకులు ఇవ్వాలనే నిర్ణయంతో పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే, అతడి ఆరోగ్య పరిస్థితి చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.అతడు కూడా నా బిడ్డ లాంటివాడేఈ విషయాన్ని తాజాగా ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండ్రియా వెల్లడించింది. ‘‘విడిపోవాలనే ఆలోచన వచ్చింది. అయితే, నేను వదిలేస్తే అతడు ఏమైపోతాడోననే భావన నన్ను నిలవనీయలేదు.అతడు కూడా నా బిడ్డ లాంటివాడే. అతడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. స్నేహితుల విషయంలోనే నేను చాలా ఎమోషనల్‌గా ఉంటాను. అలాంటిది నా జీవిత భాగస్వామి పట్ల ఇంకెంత ప్రేమ ఉంటుందో అర్థం చేసుకోండి.ఇక విడిపోవాలని అనిపించలేదుకొన్నిసార్లు తనతో గొడవపడి బయటకు వెళ్లిపోయేదాన్ని. కానీ అతడు భోజనం చేశాడో.. లేదో.. నిద్రపోయాడా లేదంటే ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా? అని మళ్లీ వెళ్లి చెక్ చేసేదాన్ని. అతడికి నా అవసరం ఉందని గుర్తించిన తర్వాత ఇక విడిపోవాలని అనిపించలేదు’’ అని తల్లి మనసును చాటుకుంది.నా కుమారుడు అన్నీ అర్థం చేసుకుంటాడుఅయితే, భర్త ప్రవర్తన వల్ల పిల్లలపై ఈ ప్రభావం పడిందన్న ఆండ్రియా.. ‘‘నా కుమారుడు మాత్రం చిన్న వయసులోనే నా గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అమ్మ మానసిక ఆరోగ్యంతో పాటు.. నాన్నను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని తను అప్పుడే డిసైడయ్యాడు’’ అని పేర్కొంది. కాగా ఇటీవలే మరోసారి అనారోగ్యం పాలైన వినోద్ కాంబ్లీ ప్రస్తుతం కోలుకున్నాడు. తన భార్య వల్లే ఇది సాధ్యమైందంటూ ఆమెపై ప్రేమను కురిపించాడు. చదవండి: పరాయి స్త్రీలను తాకను.. ఇంత పొగరు పనికిరాదు! -
వివాదంలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్య
-
కాంబ్లీ భార్యతో అసభ్య ప్రవర్తన
సాక్షి, ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్యతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. కాంబ్లీ భార్య ఆండ్రియా ఆ వృద్ధుడిపై చెయ్యి చేసుకోగా.. సదరు వృద్ధుడ్ని బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ తండ్రి రాజ్ కుమార్ తివారీగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో అంకిత్ సోదరుడు అంకుర్ తిరిగి కాంబ్లీ దంపతులతో వాగ్వాదానికి దిగారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం మలాద్‌లోని ఇన్ఆర్బిట్ మాల్‌కు కాంబ్లీ-ఆండ్రియా వెళ్లారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ వృద్ధుడు ఆండ్రియాను తాకాడు. దీంతో కోపంతో ఆమె తన చేతిలోని బ్యాగుతో అతనిపై దాడి చేసింది. ఆ వెంటనే కాంబ్లీ జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. అయితే కాసేటికే ఆ వ్యక్తి కొడుకులమంటూ ఓ ఇద్దరు వ్యక్తులు కాంబ్లీ-ఆండ్రియాలతో గొడవకు దిగారు. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవటంతో మాల్ సిబ్బంది జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటన తర్వాత కాంబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరోవైపు తివారీ సోదరులు కూడా బంగూర్ నగర్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. చెప్పుతో కొట్టింది... కాగా, తివారీ సోదరులు ఘటనపై మీడియాతో మాట్లాడుతూ కాంబ్లీ భార్యపై ఆరోపణలు గుప్పించారు. ‘తోపులాటలో నా తండ్రి పొరపాటున ఆమెను తాకాడు. వృద్ధుడని కూడా చూడకుండా ఆమె చెప్పుతో కొట్టింది. అందుకే వాళ్లను మేం నిలదీశాం. కానీ, కాంబ్లీయే మమల్ని బెదిరించాడు’ అని అంకుర్ చెబుతున్నాడు. అయితే కాంబ్లీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నాడు. -
వినోద్ కాంబ్లీ మళ్లీ పెళ్లికొడుకయ్యాడు!
క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి పెళ్లి కొడుకయ్యాడు. శనివారం బాంద్రాలోని సెయింట్ పీటర్స్ చర్చ్ లో జరిగిన వేడుకలో తన భార్య అండ్రియా హెవిట్ కాథలిక్ సంప్రదాయ పద్దతిలో పెళ్లాడారు. గతంలో కోర్టు ద్వారా వినోద్, ఆండ్రియాలు తమ వైవాహిక సంబంధానికి చట్టబద్దత కల్పించుకున్నారు. కొద్ది రోజుల క్రితం గుండె పోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన కాంబ్లీ ఆధ్యాత్మిక చింతనకు లోనయ్యారట. ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించిన కాంబ్లీ సాంప్రదాయ పద్దతిలో పెళ్లాడాలని నిర్ణయించకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరైన కార్యక్రమానికి వినోద్, ఆండ్రియా కుమారుడు జీసస్ క్రిస్టియానో కూడా ముఖ్య అతిధిగా మారడం విశేషం. వినోద్, ఆండ్రియాల వివాహ వేడుకకు బాలీవుడ్ నటులు అశుతోష్ రానా, సతీమణి రేణుకా సహానీలు హాజరయ్యారు.