బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసు.. మరో ముందడుగు | Vijayawada Gang War Case Police Arrest Another Mine Members | Sakshi
Sakshi News home page

బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసు.. మరో ముందడుగు

Jun 10 2020 6:03 PM | Updated on Jun 10 2020 6:15 PM

Vijayawada Gang War Case Police Arrest Another Mine Members - Sakshi

సాక్షి, కృష్ణా: జెజయవాడ గ్యాంగ్‌ వార్‌ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. పోలీసులు మరో తొమ్మిది మంది వీధి రౌడీలను బుధవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిలో పండు గ్యాంగ్‌కి చెందినవారు ఐదుగురు, సందీప్ బ్యాచ్‌కి చెందినవారు నలుగురు ఉ‍న్నారు. ఇప్పటికే రెండు గ్యాంగ్‌లకు చెందిన 24 మందిని పోలీసులు రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. ఆరు పోలీసు బృందాలు కేసు మూలాలను అన్వేషిస్తున్నాయి.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే గ్యాంగ్ లీడర్ పండుని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. పండు విచారణలో సందీప్ హత్య వెనక ఉన్న కారణాలను పోలీసులు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. సందీప్ కుటుంబసభ్యుల ఆరోపణలపైనా విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో కీలక విషయాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నగర సీపీ ద్వారకా తిరుమలరావు వీధి రౌడీలకు నగర బహిష్కరణ విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement