చింతమనేనిపై ఫిర్యాదుల వెల్లువ

Victims Complaints Against Former MLA Chintamaneni Prabhakar - Sakshi

సాక్షి, ఏలూరు (టూటౌన్‌): దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై శనివారం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బాధితులు ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవల్‌ను కలిసి నేరుగా ఫిర్యాదులు చేశారు. జగన్నాథపురం, సోమవరప్పాడు, భోగాపురం, శ్రీరామవరం గ్రామాల్లో ఫిర్యాదుదారుల పొలాలను ఆక్రమించి వారిపై చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దళితుల భూములను ఆక్రమణలు చేసి చంపుతామని బెదిరించినట్లు పలువురు బాధితులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. చింతమనేనిపై కేసులు పెట్టినా  రాజకీయ పలుకుబడి ఉపయోగించి సదరు కేసుల్లో ఏ విధమైన చర్యలు తీసుకోకుండా అడ్డుపడినట్లు బాధితులు తెలిపారు. దెందులూరు మండలం శ్రీరామవరంలో గతేడాది నవంబరు 15 రాత్రి బహిరంగ ప్రదేశంలో దళితులను ఉద్దేశించి అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడిన విషయం గురించి శనివారం కొత్తపల్లి సురేష్, కొంతమంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ ఇచ్చిన ఫిర్యాదులను పూర్వాపరాలు విచారించిన అనంతరం కేసుల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top