పోలీసుల కస్టడీకి వరవరరావు

Varavara Rao back in Pune police custody - Sakshi

పుణే: మావోయిస్టులతో సంబంధాల కేసులో విరసం సభ్యుడు వరవరరావును మహారాష్ట్రలోని ఓ కోర్టు నవంబర్‌ 26 వరకూ పోలీసుల కస్టడీకి అప్పగించింది. సుప్రీంకోర్టు ఈ నెల 15వరకూ విధించిన గృహనిర్బంధం ముగిసిన నేపథ్యంలో శనివారం ఉదయం పుణే పోలీసులు హైదరాబాద్‌లో వరవరరావును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పుణేలోని జిల్లా సెషన్స్‌ జడ్జి కిశోర్‌.డి.వదనే ముందు ఆదివారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల పవార్‌ వాదిస్తూ.. గణపతి రహస్య స్థావరాలతో పాటు మావోల లేఖల్లో ఉన్న కోడ్‌భాషపై విచారించేందుకు వరవరరావును 14 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం 9 రోజుల పాటు వరవరరావును పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top