రౌడీ షీటర్‌పై కత్తులతో దాడి

Unknown Persons Attack With Knives On Rowdy Sheeter in Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ: రద్దీగా ఉండే సుబ్బయ్య హోటల్‌ పరిసరాల వద్ద ఒక్క సారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుకేసుల్లో నిందితుడు, రౌడీషీటర్‌ సతీష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా కాకినాడ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.  పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక సుబ్బయ్య హోటల్‌ వద్ద రౌడీషీటర్‌ సతీష్‌పై కొందరు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన సతీష్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే అతడిపై ప్రత్యర్థులే దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గతంలో జరిగిన జంట హత్యల కేసులో సతీష్‌ ప్రధాన నిందుతుడు కావడంతో ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.  
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top