గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య | Unknown Person Suicide Warangal | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

Nov 15 2018 12:31 PM | Updated on Nov 15 2018 12:31 PM

Unknown Person Suicide Warangal - Sakshi

నర్మెట: చెట్టుకు ఉరేసుకున్న వ్యక్తి

సాక్షి, నర్మెట: గుర్తుతెలియని ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలం లోని లోక్యాతం డా శివారులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకోగా వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతదేహం వేలాడుతూ కనిపించింది. స్థానికులను విచారించగా వ్యక్తి వివరాలు తెలియరాలేదని ఎస్సై జక్కుల పరమేశ్వర్‌ తెలిపారు.మృతుడు ఎర్రని చారల చొక్కా, చెవి పోగుతో గుండు చేయించుకున్న చామనచాయ రం గు కలిగి సుమారు 40 ఏండ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. స్థలంలో తెల్లని ప్లాస్టిక్‌ సంచి, టార్చిలైటు,   నల్లని ప్యారాగాన్‌ చెప్పులు, దు ప్పటి, బొంతలు లభించాయని తెలి పారు. ఈ వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నుట్ల ఎస్సై పరమేశ్వర్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement