మహిళ కేకలు వేయడంతో పట్టుబడిన దొంగలు | Two Robbers Were Arrested by Police in Bodhan | Sakshi
Sakshi News home page

మహిళ కేకలు వేయడంతో పట్టుబడిన దొంగలు

Nov 13 2019 2:25 PM | Updated on Nov 13 2019 2:31 PM

Two Robbers Were Arrested by Police in Bodhan - Sakshi

బోధన్‌ పోలీస్‌ స్టేషన్‌

సాక్షి, నిజామాబాద్‌ : మహిళ మెడలోని పుస్తెల తాడును దొంగిలించాలని చూసిన ఇద్దరు దొంగలు ఆమె కేకలు వేయడంతో పోలీసులకు దొరికిపోయారు. జిల్లాలోని బోధన్‌ డివిజన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అంతకుముందు మంగళవారం బోధన్‌లోని నాయీ బ్రాహ్మణ వీధిలో ఇంటి బయట నిల్చున్న మహిళ మెడలో గొలుసు తెంపడానికి ప్రయత్నించారు. కానీ, మహిళ అప్రమత్తంగా ఉండడంతో వీరి ప్లాన్‌  బెడిసికొట్టింది. బుధవారం ఎడవల్లిలో మాత్రం వారి ప్లాన్‌ సక్సెస్‌ అయ్యింది. వెంటనే మహిళ కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. స్పందించిన పోలీసులు దొంగలను వెంబడించి సినీ ఫక్కీలో వారిని పట్టుకున్నారు. విచారణ అనంతరం బుధవారం సాయంత్రం పోలీస్‌ కమిషనర్‌ సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement