జిల్లాలో రెండు ప్రేమజంటల ఆత్మహత్య.. | Two Love Couple Commited Suicide In Rangareddy | Sakshi
Sakshi News home page

రంగారెడ్డిలో ఒకేరోజు రెండు ప్రేమజంటల ఆత్మహత్య

Dec 2 2019 2:52 PM | Updated on Dec 2 2019 4:22 PM

Two Love Couple Commited Suicide In Rangareddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు ప్రేమజంటలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాయి. వివరాలు.. కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన నాగిళ్ల శ్రీరామ్‌(21), సుశీల(18) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు సుశీలను మందలించారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు చనిపోయిన విషయం తెలిసిన శ్రీరామ్‌ మనస్థాపంతో పొలానికి వెళ్లి అక్కడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దలు వద్దన్నారని...
రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌ మండలం లింగారెడ్డిగూడకు చెందిన పోచమొల్ల మహేందర్‌(21), కర్రోళ్ల పల్లవి(19) ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలని ఎన్నో కలలు కన్నారు. కానీ వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోరన్న భయంతో సోమవారం ఒకే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement