ప్రయాణికులపైకి దూసుకెళ్లిన లారీ | Two died In Road Accident At Wanaparthy District | Sakshi
Sakshi News home page

ప్రయాణికులపైకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు మృతి

Mar 3 2018 4:21 PM | Updated on Aug 30 2018 4:20 PM

సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లా  పెబ్బేరు మండలం గుమ్మడంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.గుమ్మడం క్రాస్ రోడ్డు వద్ద బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో ఇద్దురు అక్కడికక్కడే మృతి చెందగా.. సర్పంచ్ పద్మ తీవ్రంగా గాయపడింది. అటుగా వెళుతున్న కలెక్టర్ శ్వేతామహంతి సర్పంచ్‌ను తన వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement