‘లవ్‌ జిహాద్‌’ దారుణం!

Twist in Rajasthan 'Love-Jihad' Murder: Victim Was Living With - Sakshi

రాజస్తాన్‌లో కూలీ సజీవ దహనం

జైపూర్‌: ‘లవ్‌ జిహాద్‌’కు పాల్పడ్డాడని రాజస్తాన్‌లో ఓ ముస్లిం కూలీని మరో వ్యక్తి అత్యంత పాశవికంగా నరికి సజీవ దహనం చేశాడు.  రాజసమంద్‌ జిల్లాలోని రాజ్‌నగర్‌లో బుధవారం  ఈ ఘటన జరిగింది. బాధితుడిని పశ్చిమబెంగాల్‌కు చెందిన మహమ్మద్‌ అఫ్రాజుల్‌(48)గా, హంతకుడిని స్థానికుడైన శంభులాల్‌ రాయ్‌గర్‌గా గుర్తించారు. పోలీసులు శంభూలాల్‌తో పాటు అతడి మేనల్లుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే విస్తృతంగా వ్యాపించిన ఆ వీడియోలో... హంతకుడు గొడ్డలితో బాధితుడిని నరికి, ఆ తరువాత కిరోసిన్‌ పోసి సజీవంగానే దహనం చేసినట్లు కనిపించింది.

తనను వదిలిపెట్టాలని బాధితుడు మొరపెట్టుకుంటున్నా కనికరించలేదు. లవ్‌ జిహాదీలంతా దేశం విడిచిపోవాలని లేదంటే వారికీ ఇదే గతి పడుతుందన్నాడు. సగం కాలిన శరీరంతో ఉన్న వీడియో చూడటానికి కూడా జుగుప్సాకరంగా ఉంది. ఈ వీడియో మరింత మందికి చేరకుండా నిరోధించడానికి రాజసమంద్‌లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపేశారు. హత్యకు నిందితుడు వాడిన గొడ్డలి, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  బాధితుడు అఫ్రాజుల్‌ బెంగాల్‌లోని మాల్డా నుంచి జీవనోపాధి కోసం రాజస్తాన్‌కు వలసవచ్చాడు. తమ కుటుంబంలో సంపాదిస్తున్నది అతనొక్కడేనని, హంతకుడిని కఠినంగా శిక్షించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.

Back to Top