ఘోర ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం | Tractar Accident Two Killed In NP Kunta | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

Apr 2 2019 8:58 AM | Updated on Apr 2 2019 8:59 AM

Tractar Accident Two Killed In NP Kunta - Sakshi

మృతులు హరినాయుడు, గిరినాయుడు

సాక్షి, ఎన్‌పీకుంట: జాతర నుంచి ఇళ్లకు బయల్దేరిన ఇద్దరిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. వివరాల్లోకెళ్తే... ఎన్‌పీకుంట మండలం మండెంవారిపల్లికి చెందిన పలువురు ఆదివారం తలుపుల మండలం పంతులోల్లపల్లిలో గంగమ్మ జాతరకు వెళ్లారు. సోమవారం ట్రాక్టర్‌లో తిరుగుపయనమయ్యారు. ఎన్‌పీకుంటలోని కొత్తరోడ్డు సమీపాన సీతారామ్‌ బావి వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడటంతో హరినాయుడు (33), గిరినాయుడు (12) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. కదిరి రూరల్‌ సీఐ రెడ్డప్ప, స్థానిక ఎస్‌ఐ యతీంద్ర తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రులను 108 ద్వారా కదిరి ఆస్పత్రికి తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement