టీపీఎఫ్‌ నాయకుల అరెస్ట్‌ | TPF Leaders Arrested By Warangal Urban Police | Sakshi
Sakshi News home page

టీపీఎఫ్‌ నాయకుల అరెస్ట్‌

Jun 8 2020 4:38 AM | Updated on Jun 8 2020 5:14 AM

TPF Leaders Arrested By Warangal Urban Police - Sakshi

భీమదేవరపల్లి: వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కు చెందిన టీపీఎఫ్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు గొల్లూరి ప్రవీణ్‌కుమార్, టీపీఎఫ్‌ సభ్యుడు ఉగ్గె శేఖర్‌ అలియాస్‌ శంకర్‌తో పాటు కమలాపూర్‌ మండలం కానిపర్తికి చెందిన రైతు సంఘం నాయకుడు కొత్తూరి ఇంద్రసేన అలి యాస్‌ చిన్నన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి విప్లవ సాహిత్యం, పేలుడుకు ఉప యోగించే ఐదు డైనమోలు, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన వంగర పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ బలోపేతంలో భాగంగా మాణిక్యాపూర్‌ చెరువు శివారు కట్ట వద్ద సమావేశం జరుగుతోందని సమాచారం రావడంతో ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్‌జీ, ముల్కనూర్, వంగర ఎస్సైలు టీవీఆర్‌ సూరి, గంజి స్వప్న సిబ్బందితో వెళ్లి ఉగ్గె శేఖర్, గొల్లూరి ప్రవీణ్‌ కుమార్, ఇంద్రసేనను అదుపులోకి తీసుకు న్నారని చెప్పారు. ప్రవీణ్, శేఖర్, ఇంద్రసేనను హుస్నాబాద్‌ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement