ప్రాణాలు నిలబెట్టిన సీటుబెల్ట్‌ | three men escape from danger with wearing seat belt | Sakshi
Sakshi News home page

ప్రాణాలు నిలబెట్టిన సీటుబెల్ట్‌

Jan 22 2018 7:06 AM | Updated on Aug 28 2018 7:15 PM

three men escape from danger with wearing seat belt - Sakshi

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన నిసాన్‌కారు, గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న హైవే అంబులెన్స్‌ సిబ్బంది

పెనుకొండ రూరల్‌: సీటుబెల్టు ధరించడం వల్ల ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అనంతపురం నుంచి బెంగళూరు వైపు 150 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కారు పెనుకొండ మండలం గోనిపేట వద్ద జాతీయరహదారిపై అదుపుతప్పింది. పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న ముళ్లపొదల్లో బోల్తాపడింది. కారు నుజ్జునుజ్జయ్యి రెండు ముక్కలైంది. కారులో ప్రయాణిస్తున్న బెంగళూరులోని హెబ్బాల్‌కు చెందిన రెస్టారెంట్‌ నిర్వాహకులు అవినాష్‌.జె, అవినాష్‌.బి, ఆదిత్‌లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సీటుబెల్టు పెట్టుకోవడం వల్ల వీరికి ప్రాణాపాయం తప్పిందని పెనుకొండ ఎస్‌ఐ జనార్ధన్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement