బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్‌, ముగ్గురు మృతి

Three killed as RTC bus hits bike In Nalgonda district - Sakshi

సాక్షి, చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు... టీవీఎస్ వాహనాన్ని వెనకనుంచి ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన వీరు చిట్యాల శివారులోని వివాహా వేడుకకు హాజరయ్యేందుకు వస్తుండగా వెనుక నుండి కొత్తగూడెం నుండి  హైదరాబాద్ వెళ్తున్న  TS28 Z 0067 సూపర్ లగ్జరీ బస్సు ఢీ కొట్టింది. 

ఈ ప్రమాదంలో దండు మల్కాపురం గ్రామానికి చెందిన బిక్షపతి, చెన్నారెడ్డి గూడెంకు చెందిన నరసింహ అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్‌కు మరికాసేపట్లో చేరుకునే లోపే ఘటన జరగడంతో పెళ్లి మండపంలో విషాదం చోటు చేసుకుంది. సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top