breaking news
Kottagudem Depot
-
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్, ముగ్గురు మృతి
-
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు... టీవీఎస్ వాహనాన్ని వెనకనుంచి ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన వీరు చిట్యాల శివారులోని వివాహా వేడుకకు హాజరయ్యేందుకు వస్తుండగా వెనుక నుండి కొత్తగూడెం నుండి హైదరాబాద్ వెళ్తున్న TS28 Z 0067 సూపర్ లగ్జరీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దండు మల్కాపురం గ్రామానికి చెందిన బిక్షపతి, చెన్నారెడ్డి గూడెంకు చెందిన నరసింహ అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్‌కు మరికాసేపట్లో చేరుకునే లోపే ఘటన జరగడంతో పెళ్లి మండపంలో విషాదం చోటు చేసుకుంది. సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
దిల్సుఖ్నగర్ బస్టాండ్‌లో తుపాకీ కలకలం
-
దిల్సుఖ్నగర్ బస్టాండ్‌లో తుపాకీ కలకలం
హైదరాబాద్(దిల్సుఖ్నగర్): దిల్సుఖ్నగర్ బస్టాండ్‌లో తుపాకీ కలకలం సృష్టించింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం డిపోనకు చెందిన బస్సు డ్రైవర్ నుంచి పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఎస్ఎల్ఆర్ తుపాకీ ఉన్నదన్న సమాచారంతో మలక్‌పేట పోలీసులు సోదా చేసి స్వాధీనం చేసుకున్నారు. దిల్సుఖ్నగర్ బస్టాండ్‌లో శనివారం రాత్రి 7.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.