కండక్టర్‌ నగదు బ్యాగ్‌తో ఉడాయించిన యువకుడు | Thief Arrest in Conductor bag Robbery Case Karnataka | Sakshi
Sakshi News home page

కండక్టర్‌ నగదు బ్యాగ్‌తో ఉడాయించిన యువకుడు

Aug 6 2019 8:30 AM | Updated on Aug 6 2019 8:30 AM

Thief Arrest in Conductor bag Robbery Case Karnataka - Sakshi

దుండగుడికి దేహశుద్ధి చేస్తున్న మహిళా కండక్టర్‌

కర్ణాటక ,బొమ్మనహళ్లి : ప్రయాణికుడిలా బస్సులోకి వెళ్లి కండక్టర్‌ నగ దు బ్యాగ్‌తో ఉడాయిస్తున్న ఓ వ్యక్తిని స్థానికుల సహాయంతో కండక్టర్‌ పట్టుకుని చితకబాదిన ఘటన సోమవారం కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండు వద్ద చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం  ఆనేకల్‌ నుంచి బెంగళూరు నగరానికి వస్తున్న కేఎస్‌ ఆర్‌టీసీ బస్సు మహిళా కండక్టర్, ఎంట్రీ కోసం తన నగదు బ్యాగ్‌ను సీట్‌పై ఉంచి డిపోలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు బస్సులోకి ప్రవేశించి బ్యాగ్‌ తీసుకుని పారిపోతుండగా గుర్తించిన కండక్టర్‌ గట్టిగా అరవడంతో స్థానికులు గుర్తించి దుండగుడిని పట్టుకుని చితకబాది నగదు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement