జాతరకు వచ్చి తిరిగిరాని లోకాలకు..

Tenth Student Died in Water Tank YSR Kadapa - Sakshi

పదవ తరగతిలో 9.5జీపీఏ సాధించిన భరత్‌

వైఎస్‌ఆర్‌ జిల్లా,గాలివీడు : మండలంలోని కొండ్రెడ్డిగారిపల్లె సమీపంలో ఓ రైతు ఏర్పాటు చేసుకున్న నీటి తొట్టిలో మునిగి గురువారం ఉదయం భరత్‌ (15) అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. నూలివీడు గ్రామంలో బుధ, గురువారాల్లో శ్రీ రేణుకాయల్లమ్మ జాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లెకు చెందిన విద్యార్థి భరత్‌ నూలివీడు పంచాయతీ నల్లాబత్తినవాండ్లపల్లెకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీరాములు ఇంటికి వచ్చాడు. రైతు ఏర్పాటు చేసుకున్న నీటితొట్టిలో ఈత కొడుతూ ఆకస్మికంగా మునిగి మృత్యువాత పడ్డాడు. భరత్‌ ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 9.5 జీపీఏ సాధించాడు. బంధువుల ఇంటికి వచ్చి కొడుకును కోల్పోయామని భరత్‌ తల్లిదండ్రులు బోరున విలపించారు. సంఘటనను చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top