
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: పులివెందులలో టీడీపీ నేతలు బరితెగించారు. జెడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లికి హాజరైన వైఎస్సార్‌సీపీ నేతలు సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ నాగేష్, సన్మోహన్ రెడ్డిలపై టీడీపీకి చెందిన 30 కార్యకర్తలు విచక్షణా రహితంగా దాడులు చేశారు. అప్రమత్తమైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.