
సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. భవనంపై నుంచి దూకి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది.
మియాపూర్‌లోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న హన్సిక (14) మియాపూర్ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తుపై నుండి దూకింది. తీవ్ర రక్తస్రావంతో ఘటన స్థలంలోనే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.