తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం | telangana Government Appointed SIT For Investigation On Data Breaching Case | Sakshi
Sakshi News home page

డేటా చోరీ.. తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం

Mar 6 2019 6:48 PM | Updated on Mar 6 2019 7:02 PM

telangana Government Appointed SIT For Investigation On Data Breaching Case - Sakshi

వెస్ట్‌ జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర(పాత చిత్రం)

జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్‌కు బదిలీ ..

హైదరాబాద్‌: డేటా చోరీ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక సిట్‌(స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం) ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ చేసిన దర్యాప్తు వివరాలను సిట్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. సిట్‌ ఇంచార్జిగా వెస్ట్‌ జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్రను నియమించారు.

సిట్‌ బృందంలో సైబర్‌ క్రైం డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి, డీఎస్పీ రవికుమార్‌, ఏసీపీ శ్రీనివాస్‌, మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఉండనున్నారు. జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్‌కు బదిలీ చేయనున్నారు. డీజీపీ కార్యాలయంలోనే సిట్‌కు సంబంధించి ప్రత్యేక చాంబర్‌ను కేటాయించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement