దారుణం : స్కేలుతో చేయి విరగ్గొట్టిన టీచర్‌ | Teacher Abusively Beaten Student With Iron Scale In Hyderabad | Sakshi
Sakshi News home page

స్కేలుతో చేయి విరగ్గొట్టిన టీచర్‌

Sep 4 2019 5:10 PM | Updated on Sep 4 2019 5:32 PM

Teacher Abusively Beaten Student With Iron Scale In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మీర్‌పేట్‌లోని సత్యం టెక్నో కిడ్స్‌ ప్లేస్కూల్‌లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించింది. 3వ తరగతి చదువుతున్న సాయితేజ అనే విద్యార్థిని క్లాస్‌ టీచర్‌ సుజాత ఐరన్‌స్కేల్‌తో చితకబాదడంతో ఆ బాలుడి ఎడమచేయి విరిగింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు సంఘటన గురించి ఆరా తీయడానికి స్కూల్‌కు వెళ్లగా యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement