నటుడి కోసం పోలీసుల వేట.. | Tamil Nadu Police Hunt For Actor Vimal | Sakshi
Sakshi News home page

విమల్‌ కోసం పోలీసుల వేట

Mar 15 2019 12:58 PM | Updated on Mar 15 2019 12:58 PM

Tamil Nadu Police Hunt For Actor Vimal - Sakshi

పెరంబూరు: నటుడు విమల్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల నటుడు విమల్‌ రాత్రివేళ స్థానిక విరుగంబాక్కమ్‌కు చెందిన అభిషేక్‌ అనే వర్ధమాన నటుడిపై మద్యం మత్తులో తన అనుచరులతో దాడి చేసిన విషయం తెలిసిందే. అభిషేక్‌ విరుగంబాక్కమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, విమల్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు విమల్‌ను విచారించడానికి సిద్ధమయ్యారు. బుధవారం అతని ఇంటికి వెళ్లి పోలీస్‌స్టేషన్‌కు రావలసిందిగా పిలిచారు. దీంతో మీరు వెళ్లండి, తాను వస్తాను అని చెప్పినట్లు సమాచారం.

అయితే విమల్‌ చెప్పినట్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లలేదు. పోలీసులు అరెస్ట్‌ చేస్తారని భయపడ్డ విమల్‌ పరారయ్యాడు. అతని సెల్‌ఫోన్‌ కూడా స్విచాప్‌ చేయబడింది. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. విమల్‌ నటిస్తున్న చిత్రాల షూటింగ్‌ ఎక్కడ జరుగుతుంది అని విచారిస్తున్నారు.అదే విధంగా నటడు అభిషేక్‌పై దాడి జరిగిన ఇంటి సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement