కిడ్నాప్‌ కేసులో నటుడి అరెస్ట్‌ | tamil actor arrested over kidnapping | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కేసులో నటుడి అరెస్ట్‌

Feb 2 2018 9:46 AM | Updated on Feb 2 2018 9:46 AM

tamil actor arrested over kidnapping - Sakshi

సాక్షి, చెన్నై‌: వాణియంబాడి పాఠశాల కరస్పాండెంట్‌ కిడ్నాప్‌ కేసులో తమిళ నటుడు ఒకరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. వాణియంబాడి టీచర్స్‌ కాలనీకి చెందిన సెంథిల్‌కుమార్‌.. ఆదర్శ్‌ మాట్రిక్‌  పాఠశాలలో కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. జనవరి 19న బైక్‌పై వెళ్తుండగా ఆయనను ముగ్గురు వ్యక్తులు కారులో కిడ్నాప్‌ చేశారు. కొద్ది సేపటి తర్వాత సెంథిల్‌కుమార్‌ తన అన్నయ్య ఉదయచంద్రన్‌కు ఫోన్‌ చేసి కిడ్నాప్‌నకు గురైనట్టు తెలిపాడు. తనను విడిచిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని చెప్పడంతో ఉదయచంద్రన్‌ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

తర్వాత అతడు రూ.50 లక్షల నగదుతో కృష్ణగిరి– ధర్మపురి హైరోడ్డులో కారిమంగళం అనే ప్రాంతానికి వెళ్లాడు. అతడిని వెంబడించిన వాణియంబాడి పోలీసులు కిడ్నాపర్లు ఉపయోగించిన కారు ఆధారంగా  రెడ్‌హిల్స్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కిడ్నాప్‌నకు సూత్రధారుడు హరి అని తెలిసింది. ఆంబూరు సమీపం శంకరాపురానికి చెందిన హరి పలు సినిమాల్లో విలన్‌గా నటించాడు. అతడు జిమ్నాస్టిక్‌ సెంటర్‌ కూడా నడుపుతున్నట్లు తెలిసింది. హరి భార్య ప్రియ12 ఏళ్లుగా సెంథిల్‌కుమార్‌ స్కూలులో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో సెంథిల్‌కుమార్‌ను హరి కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement