భర్త మృతిపై అనుమానం ఉంది | Suspicions on Husband Death Deepa Press Meet | Sakshi
Sakshi News home page

భర్త మృతిపై అనుమానం ఉంది

Feb 19 2019 12:26 PM | Updated on Feb 19 2019 12:26 PM

Suspicions on Husband Death Deepa Press Meet - Sakshi

మాట్లాడుతున్న దీప

చిత్తూరు కార్పొరేషన్‌: తన భర్త సురేష్‌ మృతిపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని బంగారుపాళ్యం మండలం బొమ్మాయిపల్లెకు చెందిన దీప విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏడాది క్రితం తన భర్త సురేష్‌ తిరుపతిలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో పనిచేస్తూ అనుమానాస్పద రీతిలో మృతి చెందారని తెలిపారు. ఆయన్ను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారనే అనుమానంతో అప్పట్లో తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. న్యాయం కోసం నెలల తరబడి తిరిగినా స్పందన లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులను కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత ఈనెల 15న కేసు నమోదు చేశారన్నారు. అయితే పోలీసు అధికారులు తాను ఇచ్చిన ఫిర్యాదుపై కాకుండా ఆత్మహత్యగా కేసు నమోదు చేశారని, కేసును సమగ్ర దర్యాప్తు చేసి తనకు న్యాయం జరిగేలా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని దీప విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement