రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి | Sub Inspector Died In Road Accident Nalgonda | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి

Mar 5 2019 10:36 AM | Updated on Mar 5 2019 7:32 PM

Sub Inspector Died In Road Accident Nalgonda - Sakshi

సాక్షి, నల్గొండ: పోచంపల్లి ఎస్సై మధుసూదన్ (35) మంగళవారం తెల్లవారుజామున నార్కట్ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నల్గొండలో బందోబస్తూ కారులో వెళ్తుండగా తనే డ్రైవ్ చేస్తున్న ఎస్సై బొలెరో పోలీస్ వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఎస్ఐని కామినేని హాస్పిటల్ కు తరలించగా, అక్కడచికిత్స పొందుతూ మృతి చెందారు. తిప్పర్తి మండలానికి చెందిన మధుసూదన్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మహేష్ భగవత్ కంటతడి
జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చరీలో ఎస్ఐ మధుసూదన్ మృతదేహం చూసి రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్ భగవత్ కంట తడిపెట్టారు. అశ్రు నయనాలతో మధుసూదన్ మృతదేహానికి న భగవత్, ఎస్పీ రంగనాధ్, యాదాద్రి డిసిసి రామచంద్రారెడ్డి, పోలీస్ సిబ్బంది నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement