తల్లిదండ్రులు మందలించారని.. | Student Commits Suicide In Hyderabad | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు మందలించారని..

Aug 11 2018 7:57 AM | Updated on Nov 9 2018 4:36 PM

Student Commits Suicide In Hyderabad - Sakshi

వైష్ణవి (ఫైల్‌)..

కుషాయిగూడ: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి లోనైన   ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై చంద్రశేఖర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకు చెదిన గోపి బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చి చర్లపల్లి, భరత్‌నగర్‌లో ఉంటూ కూలీగా పని చేస్తున్నాడు. అతని కుమార్తె వైష్ణవి (15) మల్లాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం స్కూల్‌ నుంచి ఆలస్యంగా  రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన వైష్ణవి శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement