చెరువులో దూకి విద్యార్థిని ఆత్మహత్య

మేడ్చల్: కీసర మండలం చీర్యాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో నివాసముంటున్న నిత్యానంద్ కుమార్తె సోనీ(24) ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామ సమీపంలోని చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఓ విషయంలో తండ్రి మందలించాడని మనస్తాపం చెంది..ఐ యామ్ గోయింగ్ టు డై అని స్నేహితురాలికి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. నిన్న ఉదయం కాలేజీకి వచ్చి బ్యాగ్‌ను కాలేజీలోనే సోనీ వదిలి వెళ్లిపోయింది. సోనీ, స్వగ్రామంలోని గీతాంజలి కాలేజీలో బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి