
సాక్షి, పశ్చిమగోదావరి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఎస్పీ నవదీప్ సింగ్ పేకాట క్లబ్బులపై జూలు విదిలారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పేకాట క్లబ్బులపై దాడుల నిర్వహించిన పలువురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 17 క్లబ్బుల్లో దాడులు చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 122 మందిని అరెస్ట్ చేసి రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఇక ప్రతివారం దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు. పేకాట, కోడిపందెలు వంటి వాటిని నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యలపై నేరుగా సమాచారం తెలిపేందుకు వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఫిర్యాదులు అందించాలనుకునే వారు 9550351100 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు. ఫిర్యాదులు, వివరాలు ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. వాట్సాప్ నంబర్ 24గంటలు అందుబాటులో ఉంటుందన్నారు.