నయా మోసగాళ్లు..

Some Persons Doing Fraud With Government Schemes - Sakshi

సాక్షి, జనగామ: గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఈజీగా డబ్బులు సాధించాలనే తపనతో తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఏకంగా ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ప్రజలను దోపిడీ చేయడానికి పక్కాగా ప్లాన్‌ వేస్తున్నారు. ఎక్కడ లేనట్లుగా ప్రజలను మభ్యపెట్టి డబ్బులు గుంజుతూ అడ్డంగా బుక్‌ అవుతున్నారు. జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు ఆద్యంతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నమిలిగొండలో జరిగిన ఆధార్‌ మోసం నుంచి తేరుకోక ముందే జనగామ మండలంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. 

నమిలిగొండలో ‘ఆధార్‌’ మోసం..
జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం నమిలిగొండలో ఆధార్‌ కార్డులతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది జూలై 1వ తేదీన నమిలిగొండ గ్రామానికి వరంగల్‌ రూర ల్‌ జిల్లా నెక్కొండ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన అలువాల వినయ్‌కుమార్‌ చేరుకున్నారు. ప్రధాన మంత్రి మోదీ మీ ఖాతాల్లో డబ్బులు వేస్తారని గ్రామంలో దండోరా వేయించారు. ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ పట్టుకొని గ్రామ పంచాయతీకి రావాలని కోరారు.

దీంతో గ్రామస్తులు ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్కులను పట్టుకొని అక్కడకు చేరుకున్నారు. వినయ్‌కుమార్‌ నాలుగు రోజులు గ్రామంలోనే మాకాం వేసి ఆధార్‌ కార్డు ఆధారంగా గ్రామస్తుల ఖాతాల నుంచి డబ్బులను డ్రా చేసుకున్నారు. తమ ఖాతాల నుంచి డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్‌ రావడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో

కొత్త వ్యక్తుల మాటలు నమ్మొద్దు..
గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చి ఏం చెప్పిన నమ్మొద్దు. ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వ అధికారులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సులువుగా డబ్బులు సంపాదించానే ఉద్ధేశ్యంతో గ్రామీణ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆధార్, బ్యాంకు నంబర్లు, ఏటీఎం పిన్‌ నంబర్లు అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తుల సంచారం ఉన్నా, అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. 
– బి. శ్రీనివాసరెడ్డి, డీసీపీ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top