సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి | Software Engineer Suspicious Death in Hyderabad | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి

Jan 8 2019 10:45 AM | Updated on Jan 8 2019 10:45 AM

Software Engineer Suspicious Death in Hyderabad - Sakshi

చంద్రశేఖర్, సౌజన్య (ఫైల్‌)

మల్కాజిగిరి: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ రమేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..నిజామాబాద్‌ జిల్లా, నవీపేట్‌ మండలం, లక్ష్మి కిషాన్‌పురం గ్రామానికి చెందిన  చంద్రశేఖర్‌(27) బేగంపేటలోని సాప్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత మార్చి నెలలో అతడివకి వనస్థలిపురం ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సౌజన్యతో వివాహం జరిగింది. నాలుగు నెలలుగా వారు  బ్యాంక్‌ కాలనీలో నివాసముంటున్నారు. ఈ నెల 5 న  చంద్రశేఖర్‌కు అతడి తండ్రి ఫోన్‌ చేసి తన ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో హైదరాబాద్‌ రావాలని సూచించాడు.

సోమవారం ఉదయం భార్యతో కలిసి కుమారుడి ఇంటికి వచ్చిన రాంబాబు తలుపులు దగ్గరగా వేసి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా చంద్రశేఖర్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. 100 నంబర్‌కు ఫోన్‌ చేయడంతో పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. రాంబాబు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్తమామలు తనను వేధిస్తున్నారని, తండ్రితో గొడవపడం, కుమార్తెకు విడాకులు ఇవ్వకపోతే వరకట్న వేధింపుల కేసు పెడతామని బెదిరించడంతో మనస్ధానం చెందినట్లు, అత్తమామలను కఠినంగా శిక్షించాలని అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement