హత్యకు గురైన మహిళ తల లభ్యం

Skeleton Head Of The Murdered Woman Was Found At Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు మత్తడి వాగు వద్ద గత నెల 25న జరిగిన మహిళ దారుణ హత్య సంఘటన తెలిసిందే. వారం రోజుల క్రితం ఈ సంఘటన వెలుగు చూసింది. అయితే మృతదేహానికి తల లేకుండా పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అదే ప్రాంతంలోని కొద్దిదూరంలో ఉన్న ఓ చెట్టు కింద పడి ఉన్న తల భాగాలను ఆదివారం గుర్తించారు. పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి. పట్టణ ఎస్‌హెచ్‌ఓ జగదీశ్‌ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. హత్యకు గురైన మహిళదే ఈ తల కావచ్చని భావిస్తున్నారు. తల భాగాలను ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించారు. తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. హంతకులు మహిళను మరో ప్రదేశంలో హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పడవేసి ఉండవచ్చని భావిస్తున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top