దారుణం: బ్రతికుండగానే కళ్లు పీకి.. | Six Year Girl Molested And Eyes Gouged Out In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

దారుణం: బ్రతికుండగానే కళ్లు పీకి..

Apr 23 2020 4:38 PM | Updated on Apr 23 2020 4:48 PM

Six Year Girl Molested And Eyes Gouged Out In Madhya Pradesh - Sakshi

దామో : ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయటమే కాకుండా బ్రతికుండగానే కళ్లు పీకి అత్యంత పాశవికంగా ప్రవర్తించాడో క్రూరుడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదే‌శ్‌లోని దామోలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం దామోకు చెందిన ఆరేళ్ల చిన్నారి స్నేహితులతో కలిసి ఇంటికి కొద్ది దూరంలో ఆడుకుంటోంది. ఆ సమయంలోనే గుర్తుతెలియని ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అప్పటినుంచి పాప కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు వెతుకులాట ప్రారంభించారు. గురువారం ఉదయం ఇంటికి దూరంగా తీవ్రగాయాలతో పడి ఉన్న పాపను వారు గుర్తించారు. ( బ్రేకింగ్‌ : లాక్‌డౌన్‌ నుంచి ఊరట )

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై సీనియర్‌ పోలీసు అధికారి హేమంత్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. ‘‘ గుర్తు తెలియని వ్యక్తి పాపపై అత్యాచారం చేశాడు. కళ్ల దగ్గర కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తున్నామ’’ని తెలిపారు. ( చెట్టు లెక్కగలవా ఓ టీచరు! పాఠం చెప్పగలవా.. )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement