ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం | Seven years old girl kidnap and molested in maharashtra | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం

Dec 23 2019 3:31 AM | Updated on Dec 23 2019 3:31 AM

Seven years old girl kidnap and molested in maharashtra - Sakshi

థానే: ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసి, హత్యాచారం చేసిన దుర్ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం చిన్నారి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు తెలపడంతో నిందితుడు కొరి (30)ని అరెస్ట్‌ చేశారు. భివండి డీసీపీ రాజ్‌కుమార్‌ షిండే కథనం ప్రకారం.. కరివాలి గ్రామానికి చెందిన కొరి శనివారం రాత్రి రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేశాడు. అనంతరం చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, బండరాయితో తలపై మోది చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఆదివారం ఉదయం పొదల మాటున చిన్నారిని మృతదేహాన్ని చూసిన బాటసారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కొరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement