-
ఏడేళ్ల బాలికపై అత్యాచారం
హోషియార్పూర్: పంజాబ్‌లోని నంగాల్ షాహిదాన్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. గురువారం బాలిక తల్లిదండ్రులు పని చేసేందుకు బయటకు వెళ్లగా, పక్కింటి వ్యక్తి అయిన సర్బ్జిత్ సింగ్ బాలికను దగ్గర్లోని పొలానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టాడు. తల్లిదండ్రులు వచ్చాక విషయం తెలుసుకొని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం
థానే: ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్యాచారం చేసిన దుర్ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం చిన్నారి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు తెలపడంతో నిందితుడు కొరి (30)ని అరెస్ట్ చేశారు. భివండి డీసీపీ రాజ్‌కుమార్ షిండే కథనం ప్రకారం.. కరివాలి గ్రామానికి చెందిన కొరి శనివారం రాత్రి రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశాడు. అనంతరం చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, బండరాయితో తలపై మోది చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఆదివారం ఉదయం పొదల మాటున చిన్నారిని మృతదేహాన్ని చూసిన బాటసారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కొరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
ఏడేళ్ల బాలికపై లైంగికదాడి
గంగవరం: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన గంగవరం మండలంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెడ్‌కానిస్టేబుల్ నరసింహులు కథనం మేరకు.. మండలంలోని వుర్రివూకులపల్లెకు చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. బుధవారం పాఠశాల వుగించుకుని ఇంటికి వచ్చింది. ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బాలాజి(20) మామిడి కాయలు ఇస్తానని చెప్పి బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. తలుపులు మూసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతుకుతూ ఆ ఇంటి వైపు వెళ్లారు. ఇంతలో బాలాజి తలుపులు తీసి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలాజిపై కేసు నమోదు చేసినట్టు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement