టిక్‌టాక్‌ వైపరీత్యం..ప్రేమించలేదని.. | School Student Kidnapped And Murdered in Tamil nadu | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని..

Jan 9 2020 10:23 AM | Updated on Jan 9 2020 10:23 AM

School Student Kidnapped And Murdered in Tamil nadu - Sakshi

చెన్నై, టీ.నగర్‌: ప్రేమించలేదని ఓ పాఠశాల విద్యార్థినిని కిడ్నాప్‌ చేసి హత్య చేసిన ప్రేమికుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం సమీపానగల కలూరు ప్రాంతానికి చెందిన ఇవా డేనియల్‌ ప్లస్‌టూ విద్యార్థిని. ఈమెకు అతే ప్రాంతానికి చెందిన సబర్షా అనే యువకుడితో ఏర్పడిన  పరిచయం ప్రేమగా మారింది. ఇలావుండగా వారి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడడంతో ఆమె అతనితో మాట్లాడడం నిలిపేసింది. ఇలావుండగా మంగళవారం పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఇవా డేనియల్‌ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారు విచారణ జరపగా సబర్షా పనిచేస్తున్న వర్క్‌షాపులో నిలిపి ఉంచిన కారు మాయమైంది. దీంతో ఇవా డేనియల్‌ను సబర్షా కిడ్నాప్‌ చేసి ఉండొచ్చని భావించిన పోలీసులు కారు తమిళనాడుకు వస్తున్నట్లు తెలుసుకున్నారు. మంగళవారం సాయింత్రం కారు వాల్‌పారై వద్ద వస్తుండగా పోలీసులు కారును అటకాయించారు. అయితే కారులో విద్యార్థిని కనిపించలేదు. దీంతో సబర్షా వద్ద విచారణ జరపగా ఆమెను హత్య చేసి ఓ ప్రాంతంలో పారేసినట్లు తెలిపారు. దీంతో సబర్షాను అరెస్టు చేసిన పోలీసులు ఘటనా ప్రాంతానికి అతన్ని తీసుకువెళ్లి ఇవా డేనియల్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

టిక్‌టాక్‌ వైపరీత్యం: టిక్‌టాక్‌ వైపరీత్యం కారణంగా ప్రియురాల్ని హత్య చేసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కన్యాకుమారి జిల్లా కేరళ సరిహద్దులో కారకోణం ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయిని 19 ఏళ్ల కుమార్తె ఆసికా. ఈమె టిక్‌టాక్‌లో పోస్టులు చేస్తుంటుంది. దీనిద్వారా అను అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత కొంతకాలానికి అతనితో సంబంధాన్ని తెంచుకుంది. సెల్‌ఫోన్‌ నెంబర్‌ బ్లాక్‌ చేసింది. దీంతో అను నేరుగా ఆసికాకు బెదిరిస్తూ వచ్చాడు. సంఘటన జరిగిన రోజున ఆసికను కత్తితో హతమార్చిన అతను తను కూడా గొంతుకోసుకుని మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement