విద్యార్థుల జుట్టు కత్తిరించిన పాఠశాల యజమాన్యం | school management hair cut students in karnataka | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జుట్టు కత్తిరించిన పాఠశాల యజమాన్యం

Feb 13 2018 7:37 AM | Updated on Sep 15 2018 6:06 PM

school management hair cut students in karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బెళగావి (సాక్షి,బెంగళూరు): అల్లరి చేస్తున్నారంటూ 20 మంది విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు జుట్టు కత్తిరించిన ఘటన సోమవారం బెళగావి తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కాకతి గ్రామంలో సెయింట్‌జాన్స్‌ పాఠశాల యజమాన్యం స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తూ క్రమశిక్షణ పాటించడం లేదనే కారణంతో 20 మంది పిల్లల జుట్టు కత్తరించింది.

పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న పిల్లల తల్లితండ్రులు పాఠశాలకు చేరుకొని యజమాన్యాన్ని నిలదీయగా పాఠశాల ముఖ్యోపాధ్యాయుడు పిల్లల తల్లితండ్రులను బెదిరించారు. అంతేకాకుండా దీనిపై ప్రశ్నించడానికి వెళ్లిన స్థానిక మీడియా ప్రతినిధులు కూడా పాఠశాల యజమాన్యం బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement