అత్యాచారం నిందితుడిపై కేసు నమోదు | School Gorl Molestation in Vizianagaram | Sakshi
Sakshi News home page

అత్యాచారం నిందితుడిపై కేసు నమోదు

Nov 29 2018 7:22 AM | Updated on Nov 29 2018 7:22 AM

School Gorl Molestation in Vizianagaram - Sakshi

సీసీ కెమెరాలో రికార్డైన రోడ్డు దాటుతున్న బాలికలు, బాలుడు (వీరిలో ఒక బాలిక అత్యాచారయత్నానికి గురైంది)

విజయనగరం , శృంగవరపుకోట రూరల్‌: మండలంలోని బొడ్డవర–తాటిపూడి రహదారిలో గుర్తు తెలియని వ్యక్తి తొమ్మిదేళ్ల వయసు గల పాఠశాల బాలికను బలవంతంగా బైక్‌పై తీసుకుని వెళ్లి అత్యాచారం చేసిన సంఘటన జిల్లాలో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  ఈ కేసు దర్యాప్తులో భాగంగా డీఎస్పీ డి. సూర్యశ్రావణ్‌కుమార్, సీఐ బి.  వెంకటరావు, ఎస్సై ఎస్‌. అమ్మినాయుడు బుధవారం బొడ్డవర ప్రాథమికోన్నత పాఠశాలను..గుర్తు తెలి యని వ్యక్తి చిన్నారిని బైక్‌పై ఎక్కించుకున్న ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ, తాటిపూడి రహదారిలో గల ఒక జీడితోటలోకి బాలికను తీసుకుని వెళ్లి అత్యాచారం చేసి పరారైన నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. నింది తుడ్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. బాధితురాలు ప్రస్తుతం విజయనగరం ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ అవుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బొడ్డవర, ఐతన్నపాలెం గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

సీసీ కెమెరా పుటేజీ పరిశీలన
బొడ్డవర జంక్షన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో మంగళవారం సాయంత్రం రికార్డైన దృశ్యాలను డీఎస్పీ శ్రావణ్‌కుమార్, సీఐ వెంకటరావు, తదితరులు పరిశీలించారు. పాఠశాల విడిచిపెట్టిన అనంతరం ఇద్దరు బాలికలు, మరో బాలుడు భుజాలకు బ్యాగులు తగిలించుకుని రోడ్డు దాటుతున్న వైనంతో పాటు గుర్తు తెలియని వ్యక్తి ఒక బాలికను బైక్‌ ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలను పోలీసులు గుర్తించారు. నిందితుడు గంట్యాడ మండలానికి చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement