రోడ్డుపై వెంటాడి.. వేటాడి

Rowdy Sheeter Murder On Road In Tamilnadu - Sakshi

వేలూరు: పట్టణ సమీపంలోని మేల్‌ విషారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వేలూరు రౌడీని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన çకలకలం రేపింది. వేలూరు సైదాపేట కన్నిఆలయం వీధికి చెందిన మదిఅయగన్‌ కుమారుడు తమిళరశన్‌(26). మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇతను రాత్రి పూర్తిగా ఇంటికి రాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మేల్‌విషారంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉన్న సర్వీస్‌ రోడ్డులో రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో హుటాహుటిన డీఎస్పీ సెల్వం, రత్నగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరపగా తమిళరశన్‌ చేతులు, కాళ్లు, గొంతు వద్ద కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. రోడ్డుపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా వెంటాడి చంపినట్లు ప్రాథమిక విచారణలో తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తమిళరశన్‌ తన అనుచరులతో కలిసి గత కొద్ది నెలల క్రితం వేలూరు కాట్టుకార వీధికి చెందిన ప్రభాకరన్‌ తలపై బండరాయిని వేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ప్రభాకరన్‌ అనుచరులు ఎవరైనా తమిళరశన్‌ను హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. తమిళరశన్‌పై ఇది వరకే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top