కర్ణాటకలో ఘోర ప్రమాదం..12 మంది మృతి | Road Accident In Karnataka Chintamani | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Jul 3 2019 2:19 PM | Updated on Jul 3 2019 2:21 PM

Road Accident In Karnataka Chintamani - Sakshi

బెంగళూరు : కర్ణాటకలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్‌బళ్లాపూర్‌ జిల్లాలో ప్రైవేటు బస్సు టాటా ఏస్‌ను ఢీ కొన్న ఘటనలో 12 మంది ఘటనస్థలంలోనే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చింతామణి నుంచి మురుగుమల్ల వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరణించిన వారిలో ఓ చిన్న పాప కూడా ఉన్నట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement