విజయవాడలో ర్యాష్‌ డ్రైవింగ్‌.. డ్రైనేజ్‌ గోతిలో పడ్డారు!

Rash Driving in Vijayawada - Sakshi

కారులో ఇద్దరు అమ్మాయిలు..

సాక్షి, విజయవాడ : నగరంలో యువత పెడధోరణులు తొక్కుతోంది. డ్రైవింగ్‌ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ర్యాష్‌ డ్రైవింగ్‌తో తోటి వాహనదారులను ఇబ్బందిపెట్టడమే కాదు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. తాజాగా నగరంలో ఇలాంటి ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా కారు కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టి డ్రైనేజీ గోతిలో పడింది. అదృష్టం బాగుండి.. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగాయాలు కాలేదు. తృటిలో ప్రమాదం తప్పింది. పిన్నమనేని పాలిక్లీనిక్‌ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో వాటర్‌ ఇంజన్‌ రెండు ముక్కలైంది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. డ్రైనేజ్‌ గోతిలో పడిన వారిని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు.  కారులోని యువకుడు మద్యం సేవించి డ్రైవింగ్‌ చేసినట్టు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి పాల్పడటమే కాదు.. అక్కడికి తన స్నేహితులను పిలిచి యువకుడు హల్‌చల్‌ చేశాడు. తననెందుకు వీడియో తీస్తున్నారంటూ కారు డ్రైవ్‌ చేస్తున్న యువకుడు ప్రశ్నించాడు. ఇంత జరిగినా ట్రాఫిక్ పోలీసులు అసలేం పట్టించుకోలేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top