మైనర్‌పై అత్యాచారం | Rape on minor girl | Sakshi
Sakshi News home page

మైనర్‌పై అత్యాచారం

Mar 3 2018 8:58 AM | Updated on Jul 28 2018 8:53 PM

Rape on minor girl - Sakshi

మల్యాల(చొప్పదండి): తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై ఎస్సీ అట్రాసిటీ కేసుతోపాటు పోస్కో(ప్రివెన్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ సెక్సువల్‌ అఫెన్స్‌) కేసును పోలీసులు నమోదు చేశారు. మల్యాల ఎస్సై నీలం రవి వివరాల ప్రకారం మల్యాల అడ్డరోడ్డులో నివాసముంటున్న విద్యార్థిని మండల కేంద్రంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తరచూ ఆటోలో పాఠశాలకు వెళ్లడంతో లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ కల్లెడ రాజేశ్‌ పరిచయం చేసుకున్నాడు. విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి ఫిబ్రవరి 28న బలవంతంగా లక్షెట్టిపేటలోని తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మార్చి 1న జగిత్యాలలో బాలికను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు ఇంటికిచేరి, తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement