దారుణం.. కాళ్లు చేతులు కట్టేసి | In Rajasthan Dalit Boy Tied Up Thrashed By Saffron Clad Men | Sakshi
Sakshi News home page

దారుణం.. కాళ్లు చేతులు కట్టేసి

Jun 5 2019 3:38 PM | Updated on Jun 5 2019 3:41 PM

In Rajasthan Dalit Boy Tied Up Thrashed By Saffron Clad Men - Sakshi

జైపూర్‌ : మైనర్‌ దళిత యువకుడిని కాళ్లు చేతుల కట్టేసి.. దారుణంగా చితకబాదుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన ఈ నెల 1న రాజస్తాన్‌లోని పాలీ జిల్లా ధనేరియా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదరు దళిత యువకుడు ఓ చిన్నారిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. దాంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆ దళిత యువకునిపై దాడికి దిగారు. అతని కాళ్లు చేతులు కట్టేసి.. కర్రలతో చితక బాదారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు దళిత యువకుడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి.. జువైనల్‌ హోమ్‌కు తరలించారు. దాంతో పాటు సదరు యువకుడి మీద దాడి చేసిన వ్యక్తుల మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ వీడియోపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

కొందరు సదరు యువకుడు చిన్నారిని ఏడిపించినందకు తన్నలు తిన్నాడని చెప్తుండగా.. మరి కొందరు ఆ దళిత యువకుడు హిందూ ఆలయంలోకి ప్రవేశించాడు. దాంతో ఆగ్రహించిన అగ్ర కులాల యువకులు అతని మీద దాడి చేసి దారుణంగా చితకబాదారని ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. చిన్నారిని ఏడిపించినందుకే సదరు యువకుడిపై దాడి చేశారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement