రైలు పట్టాలపై మరణ మృదంగం | Railway Track Sucides And Accidents Hikes In Chittoor | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై మరణ మృదంగం

Oct 5 2018 12:04 PM | Updated on Nov 6 2018 8:08 PM

Railway Track Sucides And Accidents Hikes In Chittoor - Sakshi

హడావుడిగా పట్టాలు దాటుతూ ఇనుప చక్రాల కింద నలిగిపోతున్న బతుకులు కొన్ని.. ఎక్కడ పుట్టారో.. ఎక్కడ పెరిగారో.. బతుకు ప్రయాణంలో రైలు పట్టాలపై అనాథలుగా అనంత లోకాలకు వెళుతున్న జీవితాలు మరికొన్ని.. చికాకులు, మానసిక ఒత్తిళ్లతో జీవితం ఒద్దురా అంటూ రైలుకు ఎదురెళ్లితనువు చాలించే బతుకులు ఇంకొన్ని.. ఇలా నిత్యం ఎంతోమంది అభాగ్యుల చావు కేకలు రైలు కూతలో కలిసిపోతున్నాయి. తల్లిదండ్రులకు కడుపుకోతను, కడదాకా తోడుంటానన్న భాగస్వామికి కన్నీటిని మిగిల్చి రైలు పట్టాలపైచివరి మజిలీ మింగేసుకుంటున్నాయి.

చిత్తూరు, తిరుపతి క్రైం: సమస్యలు ప్రతి ఒక్కరికీ ఉంటా యి. ధైర్యంగా ముందుకు సాగితే వాటంతట అవే దూరమవుతాయి. భయపడితే మరింత భయపెడతాయి. అంతేగాని క్షణికావేశంలో జీవితం అయిపోయిందని భావించి తీసుకునే నిర్ణయాలు కన్నతల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతాయి. ఈ మధ్య కాలంలో చాలామంది రైలు కింద పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరిలో అభాగ్యులతోపాటు ఉన్నత విద్యావంతులు కూడా ఉండడం కొంత ఆందోళనను కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఈ తరహా మరణాలు ఆందోళన కలిగించే స్థాయిలో ఉంటున్నాయి.

నిదర్శనాలు ఇవే..
తిరుపతి నగరంలోని వెంకటేశ్వర థియేటర్‌ రైల్వే గేటు వద్ద 45 సంవత్సరాల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
రెండు రోజుల క్రితం తిరుపతి నగరంలోని ఒక ప్రముఖ కళాశాలకు చెందిన విద్యార్థిని కాటన్‌ మిల్‌ సమీపంలో రైలు కింద పడుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
15 రోజుల క్రితం నగరంలోని రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి రైలు ఎక్కి కాలు జారి కింద పడి మృతిచెందాడు.
నెలరోజుల క్రితం 30 ఏళ్లు గల వ్యక్తి రైలు పట్టాలపై పడుకుని బలవణ్మరణానికి పాల్ప డ్డాడు. తల, మొండెం వేరై మృతదేహన్ని గుర్తుపట్టడానికి కూడా వీలులేకుండా పోయింది.

నేరాల నుంచి తప్పించుకునేందుకు..
కొందరు నేరాలు తప్పించుకునేందుకు కూడా రైలు పట్టాల వద్దకు చేరుకుంటున్నారు. ఎవరినో ఒకరిని చంపడం దానిని రైలు ప్రమాదాలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా కనుగొనలేని విధంగా మృతదేహాలు చిద్రమవుతున్నాయి. తద్వారా నేరగాళ్లు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు.

గుర్తించడంలో లోపం :రైలు నుంచి జారిపడిన సందర్భాల్లో గుర్తించడంలో జాప్యం కారణంగా ఒక్కొక్కసారి ఉన్నవారిని కూడా కాపాడలేకపోతున్నారు. సమాచారం లేదన్న సాకుతో శవ పంచనామా, శవపరీక్షలకు కాలయాపన జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు కూడా ఇటీవల చాలా చోటు చేసుకున్నాయి. కొందరు వ్యక్తులు రైలు కింద పడితే కనీసం రైలు నడుపుతున్న వ్యక్తి కూడా సమాచారం ఇవ్వడం లేదు. దీంతో వారి శవాలు తెల్లవారు జరిగితే రాత్రి సమయంలో గుర్తించిన రోజులు కూడా ఉన్నాయి.

అజాగ్రత్తతోను అధికమే
రైలు ప్రయాణంలో అజాగ్రత్త ప్రమాదాలకు దారితీస్తోంది. రైల్వే స్టేషన్‌లో రైలు వచ్చేది లేనిది చూసుకోకుండా పట్టాలు దాటడం, రైలు బోగీ దగ్గర నిలుచోవడం, మెట్లపై కూర్చోవడం, కదిలే రైలు ఎక్కడం ప్రమాదాలకు దారితీస్తోంది. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ అజాగ్రత్తగా ఉండడంతో బోగీ కుదింపులకు ఒక్కొసారి జారిపడుతున్నారు. శీతాకాలంలో బోగీ డోర్‌ దగ్గర ఉండే ఇనుపరాడ్లు మంచుతో తడిసి జారిపోవడం ప్రమాదాలకు ఆస్కారమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement