డబ్బు కోసం కాంగ్రెస్‌ నేత సోదరుడి దాష్టికం

In Punjab Brother of Congress Councillor Aides Thrash Woman Over Money Issue - Sakshi

చండీగఢ్‌ : అప్పు తీర్చలేదంటూ తన అనుచురులతో కలిసి ఓ మహిళను రోడ్డు మీద దారుణంగా చితకబాదాడో కాంగ్రెస్‌ నాయకుడి సోదరుడు. వివరాలు.. ముక్త్సర్‌ పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ రాకేష్‌ చౌదరి సోదరుడు తన అనుచరులతో కలిసి ఓ మహిళను విచక్షణా రహితంగా కొట్టారు. అప్పు తీర్చే విషయంలో వివాదం తలెత్తడంతో సదరు మహిళను రోడ్డు మీద పడేసి కాళ్లతో తంతూ.. దారుణంగా హింసించారు. మరో మహిళ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.
 

ఈ విషయం గురించి ఎస్‌ఎస్‌సీ మంజీత్‌ దేశి మాట్లాడుతూ.. ‘జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇందుకు బాధ్యులైన ఆరుగురు వ్యక్తులను గుర్తించాం. వారిని కఠినంగా శిక్షిస్తాం’ అని తెలిపారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చినట్లు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top