వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి | Pregnant Died Due To Doctors Negligence In Kadapa | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి

Feb 1 2019 6:27 PM | Updated on Feb 1 2019 6:36 PM

Pregnant Died Due To Doctors Negligence In Kadapa - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణి మృత్యువాత పడింది. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్‌ కడప జిల్లాలోని గాలివీడు మండలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చంద్రకళ అనే గర్భిణిని బంధువులు నూలివీడు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఏవరూ లేకపోవటంతో కాంపౌండర్‌ ఇచ్చిన ఫ్లూయిడ్‌తో చంద్రకళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మరో బిడ్డను ప్రసవించాల్సి ఉండగా సరైన వైద్యసేవలు అందక చంద్రకళ మృతిచెందింది. దీంతో వైద్యాధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గర్భిణి కుటుంబసభ్యులు  ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement